Anantapur:ఏటీఎంలో చోరీ..రూ.30 లక్షలు మాయం

స్థానిక రామ్ నగర్‌లోని కమ్మ భవన్ పక్కన గల ఎస్బీఐ ఏటీఎం లో భారీ చోరీ జరిగింది.

Update: 2024-08-04 07:58 GMT

దిశ ప్రతినిధి,అనంతపురం: స్థానిక రామ్ నగర్‌లోని కమ్మ భవన్ పక్కన గల ఎస్బీఐ ఏటీఎం లో భారీ చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి దొంగలు ఏటీఎంను గ్యాస్ కట్టర్లతో పగలగొట్టి అందులో ఉన్న రూ. ౩౦ లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూ. 30 లక్షల వరకు దొంగతనం జరిగి ఉంటుందని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. ఈ మేరకు 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Similar News