నీటి గుంత నిండుప్రాణం తీసింది...

తల్లితో కలిసి పొలానికి వెళ్లిన వీరభద్ర (3) అనే బాలుడు ప్రమాదవశాత్తు పొలంలోని నీటి గుంతలో పడి మృతి చెందాడు.

Update: 2024-09-12 16:00 GMT

దిశ, కుల్కచర్ల : తల్లితో కలిసి పొలానికి వెళ్లిన వీరభద్ర (3) అనే బాలుడు ప్రమాదవశాత్తు పొలంలోని నీటి గుంతలో పడి మృతి చెందాడు. ఈ ఘటన కుల్కచర్ల మండలం సాల్వీడ్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం నాయినోన్ పల్లి గ్రామానికి చెందిన మాదాసు బాబు, సావిత్రి (లక్ష్మి) తల్లి గారి ఇంటికి వచ్చింది. తల్లి అంజమ్మ తో కలిసి జొన్న పొలాన్ని చూసేందుకు సావిత్రి తన కుమారుడు వీరభద్రను వెంట తీసుకెళ్లింది.

    వారు పొలాన్ని చూస్తుండగా బాలుడు ఆడుకుంటూ పొలంలో ఉన్న నీటి గుంతలో జారి పడిపోయాడు. కొద్దిసేపటికి కనిపించకపోవడంతో నీటి గుంతలో పడినట్లు గుర్తించి బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉండడంతో చికిత్స కోసం హుటాహుటిన పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

Tags:    

Similar News