అన్నకు రాఖీ కట్టేందుకు వెళ్లిన చెల్లి అదృశ్యం
అన్నకు రాఖీ కట్టేందుకు వెళ్లిన ఓ చెల్లి అదృశ్యం మైంది.
దిశ, పరిగి : అన్నకు రాఖీ కట్టేందుకు వెళ్లిన ఓ చెల్లి అదృశ్యం మైంది. పరిగి ఎస్ఐ సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం పరిగి మండలం రూప్ ఖాన్ పేట్ గ్రామానికి చెందిన కె.పద్మ(45) గత నెల 19వ తేదీన తన అన్నలకు రాఖీ కట్టేందని పరిగికి బయలు దేరింది. పరిగిలో ఉన్న అన్నలకు రాఖీలు కట్టకుండానే అదృశ్యమైంది. పద్మ భర్త వెంకటయ్య రాఖీ కట్టేందుకు వెళ్లిన తన భర్త ఇంకా రాలేదంటూ రాఖీ కట్టేందుకు వెళ్లిన అన్నలకు కాల్ చేశాడు.
మాకు రాఖీ కట్టేందుకు రాలేదని వారు చెప్పారు. అనంతరం భర్త పద్మ కి కాల్ చేయగా తాను ఆరె మైసమ్మ వద్ద ఉందని చెప్పింది అనంతరం ఫోన్ కలకపోవడంతో కుటుంబీకులు ఆరె మైసమ్మ వద్ద, తెలిసిన వ్యక్తులు, బంధువుల వద్ద ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో భర్త వెంకటయ్య ఆదివారం పరిగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సంతోష్ తెలిపారు.