అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ బోల్తా, డ్రైవర్ మృతి
ప్రొద్దుటూరు పట్టణం పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడడంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి.
దిశ,కడప: ప్రొద్దుటూరు పట్టణం పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడడంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతూనే వుంది. మంగళవారం ఉదయం పెన్నానది పరివాహాక ప్రాంతమైన చౌడురు నుండి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ పై ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో పోలీసులు దాడులు నిర్వహించారు.
అధికారుల నుంచి తప్పించుకునేందుకు ట్రాక్టర్ డ్రైవర్ ప్రతాప్ (39) ట్రాక్టర్ లైట్లు ఆఫ్ చేసి అతి వేగంగా నడుపుతూ పొలాల్లోకి దూసుకెళ్లడంతో బోల్తా పడింది. ఈ సంఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ట్రాక్టర్ ప్రొద్దుటూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన వ్యక్తి పోలీసులు గుర్తించారు. రెండు ఇసుక ట్రాక్టర్‌లను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన పై ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు ట్రాక్టర్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.