అయ్యో రామా.. గోదావరి వంతెన కింద శిశువు ప్రత్యక్షం

భద్రాచలం గోదావరి వంతెన కింద అప్పుడే పుట్టిన మృత శిశువు

Update: 2024-08-13 14:09 GMT

దిశ, భద్రాచలం : భద్రాచలం గోదావరి వంతెన కింద అప్పుడే పుట్టిన మృత శిశువు ప్రత్యక్షం అయ్యింది. ఇంకా ఒంటిపై రక్తం కూడా ఆరలేదు. కన్న తల్లి కాఠిన్యమో... పేదరికమో తెలియదు కానీ, సభ్య సమాజం ముక్కున వేలు వేసుకునేలా.. మృత శిశువును ఖననం చేయకుండా, బ్రిడ్జి క్రింద బండ రాళ్లపై పడవేయడంతో చూపరుల కళ్ళు చెమర్చాయి. విషయం తెలుసుకున్న పోలీసులు మృత శిశువు ( బాలుడు )ని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఏదైనా వైద్యశాలలో మృత శిశువు జన్మిస్తే ఖననం చేసే స్థోమత లేక ఇలా వదిలి వెళ్ళారా...? లేక బ్రతికి ఉన్న శిశువును వదిలి వెళ్లడం కారణంగా మృతి చెంది వుంటుందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రైవేటు వైద్యశాలలలో ఈరోజు జరిగిన డెలివరీ రిజిస్టర్ పరిశీలిస్తే, నిజాలు వెలుగు చూసే అవకాశం ఉంది.


Similar News