పది మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

లారీ వెనుక క్యాబిన్ లో పేకాట ఆడుతున్న పది మంది పేకాట

Update: 2024-09-10 14:41 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : లారీ వెనుక క్యాబిన్ లో పేకాట ఆడుతున్న పది మంది పేకాట రాయుళ్ల పై సిద్దిపేట టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సిద్దిపేట పట్టణం రంగీలా దాబా చౌరస్తా సమీపంలోని లారీ అసోసియేషన్ ఆఫీస్ పరిసర ప్రాంతంలో లారీ వెనక క్యాబిన్ లో కొంత మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు పోలీసులు రైడ్ చేశారు. ఓరం పద్మారెడ్డి, దేశెట్టి శ్రీనివాస్, చెప్యాల అమరేందర్ రెడ్డి, గోవిందారం కనకయ్య, కానుగుల కనకయ్య, పిండి అంజయ్య, కావటి నరసయ్య, పిండి శ్రీనివాస్, రాజ బోయిన యాదగిరి, మహ్మద్ ఖలీల్ లను అదుపులోకి తీసుకొని వారి వద్ద రూ.8,365 నగదు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.


Similar News