పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి..8 మంది అరెస్ట్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో ఓ పేకాట స్థావరంపై

Update: 2024-08-29 15:30 GMT

దిశ,బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో ఓ పేకాట స్థావరంపై టాస్క్ పోలీస్ పోలీసులు మెరుపు దాడి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి మండలం తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడి తోటలో రహస్యంగా పేకాట ఆడుతున్న 8 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు రూ. 19100/- వేల నగదు, 8 సెల్ ఫోన్లు, 7 బైకులు స్వాధీనం చేసుకున్నారు. తాళ్ల గురజాల బుగ్గ గుట్ట సమీపంలోని మామిడి తోటలో రహస్యంగా డబ్బులు పందెం, పెట్టి పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న తమ సిబ్బందితో వెళ్లి పేకాట స్థావరం పైన రైడ్ చేశారు.

ఈ దాడిలో బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల గేట్ ఏరియాకు చెందిన తొంగల వెంకటేష్,గంగారాంనగర్ కు చెందిన చింతల రాజేందర్, బెల్లంపల్లికి చెందిన ఉపేందర్, తాండూర్ సుభద్ర కాలనీకి చెందిన ఎండీ హకీం,బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ ప్రాంతానికి చెందిన Sd. ఉస్మాన్, గాంధీ నగర్ కు చెందిన మాచర్ల గట్టయ్య,నాగనవేనినరేష్, బెల్లంపల్లి కి చెందిన శ్రీనివాస్ పట్టుబడ్డారు.నిందితుల నుంచి లభించిన నగదు, బైక్ లు, సెల్ ఫోన్లు, పేకముక్కలను విచారణ నిమిత్తం తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్‌లోఅప్పగించారు.


Similar News