Suicide: ‘సిన్సియర్‌గా లవ్ చేసి మోసపోవొద్దు.. నన్ను మోసం చేశారు’: సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడి బలవన్మరణం

‘నేను ఎనిమిదేళ్లుగా ఓ అమ్మాయిని సిన్సియర్‌గా లవ్ చేశాను.

Update: 2024-08-28 07:01 GMT

దిశ,అలంపూర్: ‘నేను ఎనిమిదేళ్లుగా ఓ అమ్మాయిని సిన్సియర్‌గా లవ్ చేశాను. అమ్మాయి వాళ్ల నాన్న పోలీస్ అవ్వడంతో నా ప్రేమను తొక్కేశారు. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా’ అంటూ జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జుక్కల్ స్టేజి వద్ద నివాసం ఉండే ఓ యువకుడు వీడియో విడుదల చేసి కర్నూలు పట్టణంలో ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. జుక్కల్ స్టేజి వద్ద చంద్రకళ అనే మహిళ తన కుమారుడు తెలుగు అశోక్ (25)‌తో కలిసి నివాసం ఉంటుంది. అయితే, గత ఎనమిదేళ్లుగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే ఓ ఉద్యోగి కూతురితో ప్రేమలో పడ్డాడు. ‘అమ్మాయిని సిన్సియర్‌గా లవ్ చేశాను.. సీఐ సహకారంతో నా ప్రేమను తొక్కేశారు. అందుకే నేను చచ్చిపోతున్నా.. నాలా ఎవరూ ప్రేమించి మోసపోకండి.. ఐ లవ్ యూ.. ఐ లవ్ ఇండియా అంటూ వీడియో విడుదల చేశాడు. అనంతరం అశోక్ మంగళవారం కర్నూలుకు వెళ్లి లాడ్జిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం సమాచారం అందడంతో మృతుడి తల్లి, బంధువులు మిత్రులు హుటాహుటిన కర్నూలు తరలి వెళ్లారు. ఈ మేరకు కర్నూలు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించించారు. 


Similar News