ఆర్మూర్‌లో చైన్ స్నాచింగ్.. మాయమాటలు చెప్పి వృద్ధురాలి బంగారం చోరీ
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ
దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలో పెర్కిట్ ఏరియాకు చెందిన 75 ఏండ్ల వృద్ధురాలు బ్రాహ్మణపల్లి నర్సు బాయి కి మాయ మాటలు చెప్పి గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం మిట్ట మధ్యాహ్నం చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని పెరికిట్ కు చెందిన నర్సు బాయి స్థానిక కాంగ్రెస్ లీడర్, మాజీ ఎంపీటీసీ, సొసైటీ డైరెక్టర్ మానేటి లింబాద్రి కుమారుడి వివాహానికి పెర్కిట్లో గల ఎం ఆర్ గార్డెన్ లో వెళ్లడానికి పెర్కిట్ బస్టాండ్ లో ఆటో ఎక్కి ఎమ్ ఆర్ గార్డెన్ కు వెళ్లాలని ఆటో డ్రైవర్ కు చెప్పింది. ఆ వృద్ధురాలు ఆటోలో ఎక్కడాన్ని గమనించిన దుండగులు పక్కా ప్లాన్ కొద్దీ ఆటోలో ఒక వృద్ధ మహిళ ఉండగా ఇంకా ఇద్దరు పురుషులు కొద్ది దూరం పోగానే ఆటోలో ఎక్కి వృద్ధురాలిని ఆటో నుంచి దిగకుండా చేతుల తో పట్టేసుకుని మామిడిపల్లి శివారులో అయ్యప్ప మందిర ఏరియాలో ఆ వృద్ధురాలిని ఆటో దింపి మెడలో నుంచి మూడు తులాల గుండ్లు, ఒక తులం చైన్ ను లాక్కున్నారు.
ఓ వివాహానికి వెళ్లేందుకు ఆటోలో ఎక్కి వెళ్లడానికి ప్రయత్నించిన ఓ వృద్ధ మహిళను నూతన పంతాలో ఆ వృద్ధురాలికి మాయ మాటలు చెప్పి వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసులను గుర్తు తెలియని వ్యక్తులు స్నాచింగ్ చేసిన సంఘటన శుక్రవారం మిట్ట మధ్యాహ్నం ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో జరిగింది. ఆటోలో ఎక్కిన వృద్ధురాలి నుంచి బంగారాన్ని లాక్కొని ఆ వృద్ధ మహిళను తోసేసి అక్కడి నుండి ఆటో డ్రైవర్ అందులో ఎక్కిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వెళ్లిపోయారు. మామిడిపల్లి శివారులోని అయ్యప్ప మందిరం ఏరియాలో పడి ఉండి వృద్ధురాలు ఏడుస్తుండగా బైక్ పైన వచ్చి పోయేవారు చూసి ఆ వృద్ధురాలి దగ్గరికి వచ్చి మాట్లాడి వివరాలు తెలుసుకొని పెర్కిట్లోని ఆవిడ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు మామిడిపల్లి లోని అయ్యప్ప మందిర పరిసరాల్లోకి వచ్చి వృద్ధురాలిని తీసుకెళ్లారు. వృద్ధురాలి బాధిత కుటుంబ సభ్యులు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో చైన్ స్నాచింగ్ జరిగిన విషయాన్ని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.