ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. మరణశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు

సంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పోక్పో కేసు దోషి గఫార్‌ఖాన్‌కు మరణశిక్ష విధించింది.

Update: 2024-09-12 13:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పోక్పో కేసు దోషి గఫార్‌ఖాన్‌కు మరణశిక్ష విధించింది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో కోర్టు గురువారం విచారణ జరిపింది. దోషి మరణశిక్షే సరైన నిర్ణయమని తీర్పు చెప్పింది. అంతేకాదు.. బాలిక కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. బిహార్‌కు గఫార్ ఖాన్(56) అనే అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం సంగారెడ్డికి వచ్చారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని చైతన్య కంపెనీ పక్కన లేబర్ రూమ్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే అదే ఏరియాలో ఉంటోన్న ఆరేళ్ల బాలికపై కన్నెశాడు. కూల్ డ్రింక్ కొనిస్తానని చెప్పి పాపను తీసుకెళ్లాడు. అందులో మద్యం కలిపి ఇచ్చాడు. అనంతరం డ్రింక్ తాగించి పత్తి చేనులోకి తీసుకెళ్లి పాపపై అత్యాచారం చేశాడు. అనంతరం ఎవరికైనా చెబుతుందేమోనని భయంతో గొంతు నులిమి హత్య చేశాడు. దీనిపై స్థానిక పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. చివరకు తుది విచారణ జరిపిన కోర్టు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.


Similar News