అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా రవాణా చేసేందుకు నిల్వ ఉంచిన 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు.
దిశ ,దౌల్తాబాద్ : అక్రమంగా రవాణా చేసేందుకు నిల్వ ఉంచిన 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. దౌల్తాబాద్ మండల కేంద్రంలో తన ఇంటి దగ్గర అక్రమంగా రెండు వాహనాలలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం ఉన్నాయని పక్కా సమాచారంతో రైడ్ చేసి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
వీటితోపాటు రేషన్ బియ్యాన్ని తరలించే ప్రశాంత్ గౌడ్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా చుట్టుపక్కల గ్రామాల్లో రూ.14 కు కొనుగోలు చేసి 18 రూపాయలకు అమ్ముతున్నట్లు తెలిపారు. రేషన్ బియ్యాన్ని ప్రశంత్ అనే వ్యక్తి అక్రమ దందాను నడిపిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని పోలీసు స్టేషన్ కు తరలించి తూకం వేయగా 30 క్వింటాళ్ల ఉన్నాయని విచారణలో తేలినట్టు తెలిపారు. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని సీవిల్ సప్లై అధికాలు పరిశీలించినట్టు తెలిపారు.