సాగర్ ఎడమ కాలువలో పడి యువకుడు గల్లంతు..

సాగర్ ఎడమకాల్వలో పడి యువకుడు గల్లంతయిన సంఘటన ఆదివారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని వెలిదండ గ్రామంలో జరిగింది.

Update: 2024-08-11 16:34 GMT

దిశ, గరిడేపల్లి : సాగర్ ఎడమకాల్వలో పడి యువకుడు గల్లంతయిన సంఘటన ఆదివారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని వెలిదండ గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హుజూర్ నగర్ పట్టణానికి చెందిన లచ్చుమళ్ల వెంకట్ (20) వెలిదండ గ్రామంలోని బంధువులైన కామళ్ల మరియా రాణి కూతురు వివాహ కార్యక్రమానికి శనివారం హాజరై, రాత్రి భోజనాల సమయంలో అందరికి భోజనాలు వడ్డించాడని, అందరితో కలిసి సంతోషంగా గడిపిన వెంకట్ తెల్లారి కాల్వలో కొట్టుకొని పోవడం అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆదివారం ఉదయం గ్రామస్తులతో కలిసి ఈతకు వెళ్లాలని ప్రయత్నం చేశాడని, గ్రామ పరిధిలో గల లిఫ్ట్ వద్ద లోతు తక్కువగా ఉంటుందని చెప్పడంతో అందరూ లిఫ్ట్ వద్దకు ముందుగా ఈతకు వెళ్లారు.

కానీ వెంకట్ కి ఆలస్యం కావడంతో, అందరూ స్నానానికి వెళ్ళిపోయారు. దీంతో అతనికి లిఫ్ట్ ఎక్కడో తెలియక పోవడంతో అతను సాగర్ ఎడమ కాల్వవద్దకు వచ్చాడని, ఎవరు కనిపించకపోవడంతో ఒక్కడే కాల్వ సైడ్ వాల్ కి గల మెట్లవద్ద బట్టలు విడిచి చెప్పులతో మెట్ల పై దిగాడు. కాల్వ ఉధృతంగా ప్రవహింస్తుండడంతో ఈత రాని వెంకట్ కాల్వలో పడి గల్లంతయ్యాడు. కొంత సమయం తర్వాత వెంకట్ ఇంతవరకు రాలేదని మిగతా వారు ఆరాతీయగా కాల్వ కట్ట పై అతను విడిచిన బట్టలు చూసి కాల్వలో కొట్టుకు పోయాడని నిర్ధారించుకొని అతని కొరకు కాల్వవెంట గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతయిన వెంకట్ హుజూర్నగర్లోని ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడని అన్నారు. కాగా ఇంతవరకు వెంకట్ మృతదేహం లభించలేదు.

Tags:    

Similar News