మహిళను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..అక్కడికక్కడే మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన కొత్తూరు

Update: 2024-08-30 04:23 GMT

దిశ, కొత్తూరు : ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నాట్కో కంపెనీ దగ్గరలో గల బైపాస్ వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు దాటుతున్న మహిళను హైదరాబాద్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది అని తెలిపారు.ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News