ఢిల్లీలో నైజీరియన్ డ్రగ్ సూత్రధారి అరెస్ట్
డ్రగ్ సిండికేట్‌కు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న నైజీరియన్ జాతీయుడిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అరెస్టు చేసింది.
దిశ, వెబ్ డెస్క్ : డ్రగ్ సిండికేట్‌కు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న నైజీరియన్ జాతీయుడిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అరెస్టు చేసింది. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో నిందితడుడిన చాకచక్యంగ అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. అనంతరం అతడిని ట్రాన్సిట్ రిమాండ్‌పై ముంబైకి తరలించి కోర్టులో హాజరుపరిచారు. జూన్ 28న డీఆర్ఐ అధికారులు కొరియర్ టెర్మినల్ నుంచి 500 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు ఆపరేషన్ ప్రారంభమైంది.
ముంబయిలోని నలసోపరా ప్రాంతంలో డెలివరీ ఆపరేషన్‌లో పక్కా ప్రణాళికతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి అరెస్టు తర్వాత, వారి డిజిటల్ పరికరాల ఫోరెన్సిక్ విశ్లేషణ న్యూఢిల్లీ నుంచి పని చేస్తున్న నైజీరియన్ జాతీయుడిని గుర్తించాని పోలీసులు తెలిపారు. రెండు నెలల పాటు విస్తృత నిఘా అనంతరం నిందితుడిని ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించి చాకచక్యంగా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తదుపరి విచారణ కోసం నిందితుడు ప్రస్తుతం డీఆర్‌ఐ కస్టడీలోనే ఉన్నాడు.