Suicide:ఎంసీఏ విద్యార్థి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బోయినపల్లెలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దిశ,రాజంపేట:అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బోయినపల్లెలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలానికి చెందిన పవన్ కళ్యాణ్ అన్నమాచార్య కళాశాలలో ఎంసీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం రాజంపేట మండలంలోని హస్త వరం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల పై పడుకుని పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న జీఆర్‌పీఎఫ్ పోలీసులు పవన్ కళ్యాణ్ మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.