కొండాపూర్‌లో ఇంటర్నేషనల్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు

సర్వీస్ అపార్ట్మెంట్ అద్దెకు తీసుకున్న ఓ వ్యక్తి కొందరు విదేశీయులతో

Update: 2024-08-22 14:05 GMT

దిశ,శేరిలింగంపల్లి : సర్వీస్ అపార్ట్మెంట్ అద్దెకు తీసుకున్న ఓ వ్యక్తి కొందరు విదేశీయులతో అందులోనే సెక్స్ రాకెట్ ని నడిపిస్తుండగా పక్కా సమాచారంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు గచ్చిబౌలి పోలీసులతో కలిసి దాడులు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ కు చెందిన శివకుమార్ అనే వ్యక్తి కొండాపూర్ ప్రొఫెసర్ కాలనీలో సర్వీస్ అపార్ట్మెంట్ అద్దెకు తీసుకున్నాడు. ఆయా దేశాల నుండి వచ్చి ఢిల్లీ, బాంబే, బెంగళూరు, హైదరాబాద్ లలో ఉంటున్న విదేశీ అమ్మాయిలతో కనెక్ట్ అయ్యి, వారికి ఇతర సౌకర్యాలతో మంచి వసతి కల్పించి, లొకాంటో వెబ్‌సైట్‌లో వారి ప్రొఫైల్‌ లను ఉంచి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు.

వీరిలో కెన్యాకు చెందిన 14 మంది, ఉగాండాకు చెందిన ఇద్దరు, టాంజానియాకు చెందిన ఒకరిని ఆయా నగరాల నుండి కొండాపూర్ కు తీసుకువచ్చి విటులకు సమాచారం ఇచ్చి వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారంతో నిఘా పెట్టిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు మొత్తం 17 మంది అమ్మాయిలను అరెస్ట్ చేశారు. ఆర్గనైజర్ శివకుమార్ తో పాటు, ఇద్దరు కస్టమర్‌ లను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 4 మొబైల్ ఫోన్‌ లు, రూ.20 వేల నగదు, 104 కండోమ్‌ లు, హుక్కా పాట్స్, 25 హెచ్‌ఐవి కిట్‌ లు, 3 సెక్స్ టాయ్‌ లు, ఒక లెనోవో ల్యాప్‌టాప్, ట్యాబ్ ను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు శివకుమార్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. పట్టుబడ్డ అమ్మాయిలను కోర్టు ద్వారా సేఫ్-హోమ్‌ కు పంపినట్లు తెలిపారు.


Similar News