భారీగా గంజాయి స్వాధీనం
అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను గురువారం యాచారం పోలీసులు పట్టుకున్నారు.
దిశ, యాచారం : అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను గురువారం యాచారం పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కారులో సుమారుగా 60 కిలోల గంజాయిని హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తూ పట్టు పడ్డారు. మాల్ చెక్ పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.