ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మోసం.. ఆరుగురు అరెస్ట్
డబుల్ బెడ్ రూములు ఇస్తామని, ట్రాన్స్ఫర్లు చేస్తామని, ఉద్యోగ
దిశ,ఎల్బీనగర్ : డబుల్ బెడ్ రూములు ఇస్తామని, ట్రాన్స్ఫర్లు చేస్తామని, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పలువురిని మోసం చేసి రూ 1 కోటి 29 లక్షలు వసూలు చేసిన ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి డూప్లికేట్ రబ్బరు స్టాంపులను స్వాధీనం చేసుకున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు. శుక్రవారం ఎల్బీనగర్ లోని సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులను చీటింగ్ చేయడమే కాకుండా నేను ఆర్డీవోను మాట్లాడుతున్నాను, త్వరలో ఇల్లు వస్తాయని బాధితులకు నకిలీ వ్యక్తులు తోటి ఫోన్లో మాట్లాడించడమే కాకుండా ప్రభుత్వ సలహాదారుడైన నరేందర్ రెడ్డి పేరును కూడా వాడుకున్నారని సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.
ఆరుగురు నిందితుల్లో ఏ వన్ సురేందర్ రెడ్డి ఈ విషయంలో ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా లావాదేవీ మార్పిడిలు జరిగాయని ఇందులో కోటి 29 లక్ష రూపాయలు క్రికెట్ బెట్టింగ్ లో పెట్టాడని సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని , ట్రాన్స్ఫర్లు చేస్తామని, డబుల్ బెడ్ రూమ్ లు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు కోరారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు అడిషనల్ డీసీపీలు తదితరులు పాల్గొన్నారు.