హత్య కేసులో నలుగురు అరెస్ట్

గత రెండు రోజుల క్రితం జరిగిన పాత విశ్వనాథం హత్య కేసులో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

Update: 2024-08-30 14:53 GMT

దిశ, కామారెడ్డి : గత రెండు రోజుల క్రితం జరిగిన పాత విశ్వనాథం హత్య కేసులో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ నేరానికి సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు. పాత విశ్వనాథంను హత్య చేసిన కేసులో లక్ష్మీబాయి, ఆమె అల్లుడు రాజశేఖర్, పోచయ్య, జంగం శంకరప్ప అనే నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. 

Tags:    

Similar News