ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రఘునాథపాలెం మండలంలోని హర్యా తండా దగ్గర ఓ కారు ప్రమాదవశాత్తూ అదుపు తప్పి చెట్టును
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రఘునాథపాలెం మండలంలోని హర్యా తండా దగ్గర ఓ కారు ప్రమాదవశాత్తూ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తోన్న ముగ్గురు మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.