ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్ ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు మృతి

మండలంలోని తాండ్ర గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి

Update: 2024-08-28 13:13 GMT

దిశ, మామడ : మండలంలోని తాండ్ర గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వాస్తాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. ఎస్సై సందీప్ తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి . వాస్తాపూర్ గ్రామానికి చెందిన ఆడెం శ్యామ్ రావు (47) ,ఆడెం సంతోష్ (25), లు బైక్ పై వెళ్తుండగా అతివేగంతో గ్రామం వైపు వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ వారిని ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. వీరికి తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం సంఘటన స్థలాన్ని సీఐ నవీన్ కుమార్ సందర్శించారు. శ్యామ్ రావు ,భార్య లక్ష్మీబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


Similar News