మహిళ బస్టాప్ లో వేచి ఉండగా చైన్ స్నాచింగ్

ఓ మహిళ బస్టాప్ లో నిలబడి ఉండగా బైక్ పై వచ్చిన దుండగుడు ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తెల తాడును అపహరించుకుపోయాడు.

Update: 2024-07-16 15:45 GMT

దిశ,రాజేంద్రనగర్ : ఓ మహిళ బస్టాప్ లో నిలబడి ఉండగా బైక్ పై వచ్చిన దుండగుడు ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తెల తాడును అపహరించుకుపోయాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి 8 గంటలకు జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. బుద్వేల్ కు చెందిన ఇందిర స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా పని చేస్తుంది.

    మంగళవారం రాత్రి 8 గంటలకు విధులు పూర్తయిన తర్వాత ఆమె సమీపంలో ఉన్న బస్టాప్ లో నిలబడి ఉంది. బైక్ పై వచ్చిన ఓ దుండగుడు ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తెలతాడును అపహరించుకొని పారిపోయాడు. దాంతో వెంటనే బాధితురాలు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు చేరుకొని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. 


Similar News