చైన్ స్నాచర్ అరెస్ట్​

మండల కేంద్రంలో శుక్రవారం వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో చైన్ స్నాచర్ దొరికినట్లు ఎస్సై బి.రాము విలేకరుల సమావేశంలో తెలిపారు.

Update: 2024-09-06 15:15 GMT

దిశ, ఏర్గట్ల : మండల కేంద్రంలో శుక్రవారం వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో చైన్ స్నాచర్ దొరికినట్లు ఎస్సై బి.రాము విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు అయ్యప్ప ఆలయ సమీపంలో వాహనాలు తనిఖీలో భాగంగా అనుమానాస్పదంగా కనిపించడంతో తనదైన శైలిలో విచారించగా చైన్ స్నాచింగ్ నిందితుడు చవాన్ కిరణ్ సింగ్ (21) నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. ఇతను మెండోరా మండలం దూదిగం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

    గత బుధవారం అపూర్వ పాఠశాల వద్ద ఉప్పులూరు గ్రామానికి చెందిన ఎనుగందుల పద్మ మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు లాక్కెళ్ళిన విషయం ఒప్పుకున్నట్లు తెలిపారు. ఇతను గతంలో మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, ఏర్గట్ల మండలాల పరిధిలోని వివిధ గ్రామాలలో పలు నేరాలకు పాల్పడ్డట్టు అంగీకరించాడని, నిందితుని ఆర్థిక సమస్యల కారణంగా పలు నేరాలకు పాల్పడినట్లు తెలిపారు. నిందితుని వద్ద నుండి మూడు బంగారు పుస్తెల తాళ్లు, ఒక పల్సర్ బైక్, ఒక సెల్ ఫోన్ ను స్వాధీనపరుచుకున్నామన్నారు. రెండు రోజుల్లో కేసును ఛేదించిన ఎస్సై రాముని, భీంగల్ సీఐ నవీన్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ వినయ్, శ్రీధర్ పాల్గొన్నారు. 

Tags:    

Similar News