BREAKING: నగరంలో పోలీసుల తనిఖీలు.. భారీగా ఎండీఎంఏ, కొకైన్ స్వాధీనం

తెలంగాణలో డ్రగ్స్, గంజాయి సమూలంగా నిర్మూలించేందుకు సర్కార్ దృష్టి కేంద్రీకరించింది.

Update: 2024-08-26 03:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో డ్రగ్స్, గంజాయి సమూలంగా నిర్మూలించేందుకు సర్కార్ దృష్టి కేంద్రీకరించింది. ఈ మేరకు మాదకద్రవ్యాలు అమ్మినా, కొనుగోలు చేసినా, తీసుకున్నా పట్టుబడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ పోలీసు శాఖకు ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే టాస్క్‌ఫోర్స్, ఎస్‌వోటీ, ఇతర పోలీసు సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో దంపతులతో పాటు మరో ముగ్గురు డ్రగ్ విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో 50 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్‌‌ను సీజ్ చేశారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ అక్రమంగా తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు నైజీరియాకు చెందిని మహిళను అరెస్ట్ చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు.   


Similar News