బాటిళ్లు డిఫెన్స్ వి... మద్యం నకిలీది
డిఫెన్స్ మద్యం బాటిళ్లలో నకిలీ మద్యం నింపుతూ సొమ్ము చేసుకుంటున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దిశ , జహీరాబాద్ : డిఫెన్స్ మద్యం బాటిళ్లలో నకిలీ మద్యం నింపుతూ సొమ్ము చేసుకుంటున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైనికులకు తమ వృత్తిపరంగా డిఫెన్స్ మద్యం బాటిళ్లను తగ్గింపు ధరలకు ప్రభుత్వాలు అందిస్తాయి. ఇలాంటి ఖాళీ బాటిలన్నింటిని జమ చేసి అందులో నకిలీ మధ్యాన్ని నింపి డిఫెన్స్ బాటిళ్లు గా చిత్రీకరించి అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఘటన జహీరాబాద్ లో వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రం బీదర్ నుంచి హైదరాబాద్కు తక్కువ ధరకు డిఫెన్స్ మద్యం సరఫరా చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్న
ఒక వ్యక్తి 44 మద్యం బాటిళ్లను ఓ కారులో తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు కొతూర్ (బి ) గ్రామ పరిసరాల్లో పట్టుకున్నారు. పట్టుకున్న వాటిలో 1000 పైపర్ బాటిల్స్ తో పాటు, బ్లాక్ అండ్ వైట్ మద్యం బాటిళ్లు ఉన్నాయి. మద్యం బాటిళ్లు, కారు విలువ రూ.7.30 లక్షలుంటుందని ఎక్సైజ్ సీఐ. శ్రీనివాసరెడ్డి, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి తెలిపారు. వీరితో పాటు డిప్యూటీ కమిషనర్ హరికిషన్, అసిస్టెంట్ కమిషనర్ ఎం.శ్రీనివాసరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర, సిబ్బంది ఉన్నారు.