నల్ల బెల్లం అక్రమ రవాణా ముఠా అరెస్ట్

అక్రమంగా భారీ ఎత్తున నల్ల బెల్లం తరలిస్తున్న మూటను అరెస్టు చేసి

Update: 2024-09-05 14:43 GMT

దిశ, జడ్చర్ల : అక్రమంగా భారీ ఎత్తున నల్ల బెల్లం తరలిస్తున్న మూటను అరెస్టు చేసి అక్రమంగా తరలిస్తున్న 68 లక్షల 50 వేల విలువగల 21.3 టన్నుల నల్లబెల్లం పట్టుకోవడంతో పాటు లారీ బొలెరో వాహనం తో పాటు ఇద్దరం పై కేసు నమోదు చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. గురువారం జడ్చర్ల ఎక్స్ప్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు.

హైదరాబాద్ కేంద్రంగా సూర్యాపేట వరంగల్ మహబూబాబాద్ ఖమ్మం జనగామ జిల్లాలకు నల్ల బెల్లం పటిక ను ఎండీ రఫీ అనే వ్యాపారి అక్రమ రవాణా చేస్తున్నాడని తెలిపారు ఇందులో భాగంగానే నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం దేవదారు కుంట తండా నల్లబెల్లం తరలిస్తున్నారు.ఇది గత కొంత కాలంగా నడుస్తోంది.దీనిపై అందిన పక్కా సమాచారం మేరకు మహబూబ్నగర్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఆర్టీసీ కొత్త బస్టాండ్ సమీపంలో గురువారం తనిఖీలు జరిపారు. నల్లబెల్లం లోడుతో హైదరాబాద్ నుంచి జడ్చర్ల మీదుగా తెల్కపల్లి మండలానికి నల్లబెల్లం తరలిస్తున్న అశోక్ లేలాండ్ లారీ టీఎస్ 06యూడీ 8908 నిలిపివేసి తనిఖీలు చేయగా,60 బ్యాగుల నల్లబెల్లం(1800 కేజీలు)10 లీటర్ల నాటుసారా,20 కేజీల పటిక పట్టుబడింది.

దీనికి కారణమైన బెల్లం వ్యాపారి సింగరేణి కాలనీకి చెందిన కాట్రవత్ శ్రీనును ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా,హైదరాబాద్ నుండి తెల్కపల్లి మండలం దేవదూరుకుంటకు నల్లబెల్లం తరలిస్తున్నట్లు అదికారుల విచారణలో ఒప్పుకున్నట్లు తెలిపారు.ఇందులో బాగంగానే శ్రీను ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్లోని శివరాంపల్లి ఎక్స్ రోడ్డు దగ్గరికి వెళ్లి అక్కడే నలిపి ఉన్న మరో లారీని పరిశీలించగా (కేఏ 28బి6609) 650 బస్తాల నల్లబెల్లం,40 కేజీల పటిక,40 లీటర్ల సారాయి పట్టుబడినట్లు తెలిపారు. దీని విలువ సుమారు 68 లక్షల 50 వేలు ఉంటుందని అంచనా వేశారు దీన్ని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు, బీదర్ కు చెందిన ఎండీ రఫీని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దాడుల్లో మహబూబ్నగర్ ఎక్సైజ్ ఏఈఎస్ శ్రీనివాస్, సీఐ లు బాలకృష్ణారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, శారద, విప్లవ రెడ్డి, ఎస్సై సృజన్ రావు, నాగరాజు తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. అయితే బెల్లం సరఫరా చేస్తున్న వాహనాలను పట్టు కున్న ఎన్ ఫోర్స్మేంటు అధికారులను ఎక్సైజ్‌ ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టేంట్‌ కమిషనర్ విజయ భాస్కర్‌రెడ్డి అభినందించారు.


Similar News