దారుణం: నడిరోడ్డు మీద ప్రేమ జంటపై కత్తులతో దాడి.. ప్రియుడు మృతి

తమిళనాడులోని తిరునల్వేలిలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై గుర్తు తెలియని దుండగులు ఓ ప్రేమ జంటపై కత్తులతో దాడి చేశారు. ప్రియుడిని

Update: 2024-05-20 13:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని తిరునల్వేలిలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై గుర్తు తెలియని దుండగులు ఓ ప్రేమ జంటపై కత్తులతో దాడి చేశారు. ప్రియుడిని కిరాతకంగా నరికి చంపి పరార్ అయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీస్తున్నారు. ఘటన స్థలంలో ఉన్న సీసీ కెమెరాల్లో హత్యకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని దీపక్‌గా గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Similar News