ఆటో ఢీకొని ఏఎస్ఐ కు తీవ్ర గాయాలు

ఎమ్మిగనూరు మండల పరిధిలోని మాచమాన దొడ్డి గ్రామం విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహించడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గ్రామీణ ఏఎస్‌ఐ బాలు నాయక్ ఎదురుగా వస్తున్న ప్యాసింజర్

Update: 2024-08-08 10:12 GMT

దిశ,ఎమ్మిగనూరు:ఎమ్మిగనూరు మండల పరిధిలోని మాచమాన దొడ్డి గ్రామం విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహించడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గ్రామీణ ఏఎస్‌ఐ బాలు నాయక్ ఎదురుగా వస్తున్న ప్యాసింజర్ ఆటో ఢీకొనడంతో అక్కడికక్కడే కిందపడి తీవ్రంగా గాయపడి ఒక కాలు తొలగిపోయింది. అతని వెంట ఉన్న పోలీసుకు కూడా గాయాలయ్యాయి. పరిస్థితి పూర్తి విషమించడంతో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు, కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతామని గ్రామీణ ఎస్సై శరత్ కుమార్ రెడ్డి తెలిపారు.


Similar News