హార్ట్ టచింగ్ సీన్.. దేశ భక్తి గురించి చెబుతూ గుండెపోటుతో ఆర్మీ ఆఫీసర్ మృతి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. గుండె పోటుతో ఓ ఆర్మీ ఆఫీసర్ అక్కడిక్కకడే కుప్పకూలి మృతి చెందాడు.

Update: 2024-05-31 11:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. గుండె పోటుతో ఓ ఆర్మీ ఆఫీసర్ అక్కడిక్కకడే కుప్పకూలి మృతి చెందాడు. అయితే, చనిపోయే లాస్ట్ మినిట్ వరకు చేతిలో జాతీయ జెండా పట్టుకుని చిన్న పిల్లలకు దేశ భక్తి గురించి బోధించిన ఆర్మీ అధికారి.. సడెన్‌గా హార్ట్ స్ట్రోక్ రావడంతో స్టేజ్‌పైన కుప్పకూలాడు. అప్పటి వరకు దేశ భక్తి పాటలతో దేశ గొప్పతనం గురించి పిల్లలకు వివరించిన అధికారి.. గుండె పోటుతో కుప్పకూలి మృతి చెందిన సీన్ అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. అయితే, ఆర్మీ ఆఫీసర్ గుండె పోటుతో మరణించాడన్న విషయం తెలియని చిన్నారులు బ్యాక్ గ్రౌండ్‌లో ప్లే అయ్యే సాంగ్‌కు తగ్గట్లు చప్పట్లు కొడుతోన్న ఘటన పలువురిని కంటతడి పెట్టిస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Similar News