ప్రయాణం విషాదం..నిన్న కూతురి మృతదేహం,నేడు తండ్రి మృతదేహం లభ్యం.!

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండ‌లం పురుషోత్త‌మాయ‌గూడెం వ‌ద్ద

Update: 2024-09-02 08:03 GMT

దిశ,మ‌రిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండ‌లం పురుషోత్త‌మాయ‌గూడెం వ‌ద్ద ఆకేరు నది లో కారు గల్లంతైంది.ఈ ఘటన లో నిన్న (ఆదివారం )నూనవత్ అశ్విని మృత‌దేహం ల‌భ్యంకాగా నేడు (సోమవారం ) తండ్రి మోతీలాల్ మృత‌దేహాన్ని రెస్క్యూ టీం గుర్తించారు.ఇద్దరి లో ఒక్కరైనా ప్రాణాలతో బయట పాడుతారు అని అనుకున్నాం, ఇలా వీరి మరణ వార్త వింటాం అని అనుకోలేదు అంటూ కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.ఈ ఘ‌ట‌న వారి తండా లో కుటుంబం లో అంతులేని విషాదన్ని మిగిల్చింది.


Similar News