బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లి మృత్యువాత

ఇరాక్ దేశంలో జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన సంపంగి రాజమల్లు (35) అనే వ్యక్తి మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

Update: 2024-08-22 12:59 GMT

దిశ,జన్నారం : ఇరాక్ దేశంలో జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన సంపంగి రాజమల్లు (35) అనే వ్యక్తి మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం బుధవరాం ఇరాక్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతగూడ గ్రామానికి చెందిన సంపంగి రాజమల్లు మృతి చెందాడు. 7 సంవత్సరాల క్రితం రాజమల్లు

    బతుకుదెరువుకోసం ఇరాక్ దేశానికి వెళ్లాడని తెలిపారు. మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారని, మృతదేహాన్ని స్వదేశానికి రావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని మృతుడి తండ్రి పెద్ద మల్లయ్య వేడుకున్నారు. ఇరాక్ లో మృతి చెందడంతో చింతగూడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Tags:    

Similar News