AP News:మహిళపై దాడి చేసి దొంగతనం చేసిన నిందితుడు అరెస్ట్

పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా సప్తగిరి లాడ్జిలో మహిళ పై దాడి చేసి దొంగతనానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ కృష్ణయ్య యాదవ్ శుక్రవారం తెలిపారు.

Update: 2024-09-13 15:21 GMT

దిశ, బనగానపల్లి: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా సప్తగిరి లాడ్జిలో మహిళ పై దాడి చేసి దొంగతనానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ కృష్ణయ్య యాదవ్ శుక్రవారం తెలిపారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో సీఐ కృష్ణయ్య యాదవ్ విలేకరుల సమావేశంలో దొంగను హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీఐ కృష్ణ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా సప్తగిరి లాడ్జి నిర్వాహకురాలు పార్వతమ్మ పై దాడి చేసి మూడు తులాల గొలుసు, కమ్మలు దొంగిలించిన నిందితుడు బందెల దానమయ్యను అవుకు రోడ్డులోని గోడౌన్ వద్ద అరెస్టు చేసి మూడు తులాల బంగారు గొలుసును రికవరీ చేసినట్లు తెలిపారు. అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన బందెల దానమయ్య ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగించేవాడు. దానమయ్యకు భార్య చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని జులాయిగా తిరుగుతూ అప్పులు చేసి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సీఐ తెలిపారు.

సప్తగిరి లాడ్జిలో గతంలో రెండు సార్లు దానమయ్య వచ్చి పోయి మహిళ ఒంటరిగా ఉంటున్నట్లు గమనించి ఈ నెల 6వ తేదీన పార్వతమ్మ పై దాడి చేసి మూడు తులాల గొలుసు, చెవిలో కమ్మలను దొంగలించినట్లు తెలిపారు. అవుకు రోడ్డులోని గోడౌన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బందెల దానమయ్య మోటార్ సైకిల్ పై వస్తు తమను చూసి పారిపోతుండగా పోలీసులు వెంటపడి పట్టుకున్నట్లు తెలిపారు. అతని పట్టుకొని మోటార్ సైకిల్‌ను గుర్తించి అతని వద్ద తనిఖీ చేయగా మూడు తులాల గొలుసు దొరికిందన్నారు. నిందితుడు దానమయ్యను విచారించగా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా సప్తగిరి లాడ్జిలో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. కమ్మలను అమ్ముకొని ఖర్చు చేసినట్లు తెలిపారని మూడు తులాల గొలుసుని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులు రివార్డులు- ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా సప్తగిరి లాడ్జి లో దొంగతనం చేసిన నిందితులను పట్టుకోవడంలో కష్టపడిన పోలీసులు రామకృష్ణ, నాగన్న ప్రదీప్, ప్రసాద్‌లకు సీఐ కృష్ణయ్య యాదవ్ రివార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటసుబ్బయ్య, పోలీసులు పాల్గొన్నారు.


Similar News