గంజాయి తరలిస్తున్న యువకుడు అరెస్ట్

మండలంలోని పైడిమడుగు గ్రామ శివారులో అక్రమంగా గంజాయి

Update: 2024-08-19 14:15 GMT

దిశ, కోరుట్ల రూరల్ : మండలంలోని పైడిమడుగు గ్రామ శివారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న యువకున్ని ఆదివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు కోరుట్ల సీఐ సురేష్ బాబు తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ మాట్లాడుతూ రాయికల్ కు చెందిన పెనుకొండ గణేష్ అనే యువకుడు మల్కాజ్ గిరి లోని ఓ కళాశాలలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. గణేష్ వాళ్ళ అమ్మ ఇచ్చే డబ్బులు తన జల్సాలకు సరిపోక పోవడంతో, సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో గంజాయి విక్రయాలు చేపడుతున్నాడు. గణేష్ గత కొన్ని రోజులుగా తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి, కోరుట్ల పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లోని గంజాయి అలవాటు ఉన్న వారికి అధిక ధరలకు గంజాయి విక్రయిస్తున్నాడు.

కాగా తన వద్ద ఉన్న గంజాయిని కోరుట్లలో విక్రయించేందుకు ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. కాగా పక్కా సమాచారం మేరకు కోరుట్ల మండలంలోని పైడిమడుగు గ్రామ శివారులోని ఎల్లమ్మ ఆలయం సమీపం వద్ద కోరుట్ల ఎస్సై శ్వేత, సిబ్బంది సాగర్, పవన్ కుమార్, శ్రీనివాస్ లు ద్విచక్రవాహనంపై గంజాయి తరలిస్తున్న గణేష్ ని పట్టుకుని అరెస్టు చేశారు. నిందితుడు గణేష్ నుండి 368 గ్రాముల గంజాయి, ద్విచక్రవాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సురేష్ బాబు పేర్కొన్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సీఐ యువతకు సూచించారు. ఈ సమావేశంలో కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై శ్వేత, సిబ్బంది ఉన్నారు. 


Similar News