థ్రిల్‌గా ఉంటుందని చెప్పి యువతిని ఫ్లాట్‌కు తీసుకెళ్లిన యువకుడు.. ఎలా చనిపోయిందంటే?
ప్రస్తుత రోజుల్లో స్వంత సోదరుడ్ని కూడా నమ్మకూడదంటారు పెద్దలు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో స్వంత సోదరుడ్ని కూడా నమ్మకూడదంటారు పెద్దలు. అలాంటిది ఓ 18 ఏళ్ల యువతి తన ఫ్రెండ్ థ్రిల్ చూపిస్తాను.. నీ జీవితంలో మర్చిపోలేని థ్రిల్ పొందుతావని చెప్పగానే మాయమాటలు నమ్మి ఫ్లాట్‌కు వెళ్లింది. వివరాల్లోకెళ్తే.. ఓ యువతి బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది. ఏప్రిల్ 3 వ తేదీన లక్నోకి వచ్చింది. ఏప్రిల్ 7 న వివేక్ మౌర్య (28) ను కలిసింది. అతడితో మహానగర్లో ఉన్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లింది. మధ్యాహ్నం 3. 30 కు తీసుకెళ్లిన వివేక్.. ఫ్లాట్‌లోకి వెళ్లాక డోర్ వేశాడు. యువతిని సోఫాలో కూర్చోబెట్టి ఇంజక్షన్ ఇచ్చాడు.
తర్వాత కాసేపటికి ఆమె పరిస్థితి విషమంగా మారిపోయింది. తర్వాత వివేక్ ఆ యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆమె తల్లిదండ్రులు ఫ్లాట్‌కు వచ్చి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే తను మరణించిందని డాక్టర్లు వెల్లడించారు. బాధితురాలి పేరెంట్స్ పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా.. నిందితుడ్ని గాలించి పట్టుకున్నారు. ఫ్లాట్ లో ఏం జరిగిందని పోలీసులు గట్టిగా అడగ్గా.. అది మామూలు ఇంజక్షన్ కాదని, అందులో కొంత మత్తు పదార్థం కలిపానని నిజం చెప్పాడు. హత్యా నేరం కేసు కింద పోలీసులు వివేక్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.