కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. జీవితంపై విరక్తితో యువకుడి బలవన్మరణం

జీవితంపై విరక్తి కలిగి యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మల్లూరు గ్రామంలో చోటుచేసుకుంది.

Update: 2024-07-12 06:05 GMT

దిశ, నిజాంసాగర్: జీవితంపై విరక్తి కలిగి యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మల్లూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఆడ్డగళ్ల సాయిలు (20) ఇంటర్ వరకు చదువుకున్నాడు. అనంతరం చదువు మానేసి కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి ఓ కంపెనీలో నెల రోజులు పని చేశాడు. ఆ తరువాత అక్కడ వాతావరణ నచ్చక ఇటీవలే మళ్లీ స్వగ్రామానికి వచ్చాడు. అయితే, ఇంటికి వచ్చాయ ఏం పని చేయాలో అర్థం కాక జీవితం‌పై కలిగి విరక్తి తీవ్ర మనస్తాపానికి గురైన సాయలు గురువారం రాత్రి ఇంట్లో అందరూ పడుకున్నాక ఊరు పొలిమేర శ్మశాన వాటికలోకి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి సంజీవులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కే.సుధాకర్ తెలిపారు. 


Similar News