ఆసుపత్రి గదిలో ఆత్మహత్య చేసుకున్న స్టాఫ్ నర్స్..!!
హైదరాబాదులోని సరూర్‌నగర్‌లో పోలీసు స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాదులోని సరూర్‌నగర్‌లో పోలీసు స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన ప్రియ(23) సరూర్‌నగర్‌లోని సాయితేజ అనే ఆసుపత్రిలో గతకొంతకాలం నుంచి స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తుంది. స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తూనే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తుంది. ఇటీవల రాసిన ఓ టెస్టులో క్వాలిఫై కాకపోవడంతో మనస్తాపానికి గురైన ప్రియ ఆదివారం డ్యూటీ లేకపోవడంతో గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియ మరణవార్త విన్న కుటుంబ సభ్యులు హుటాహూటిన నగరానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.