ఆ భయంతో పెళ్లైన నెల రోజులకే నవ వరుడు ఆత్మహత్య!

పెళ్లై 30 రోజులు గడవక ముందే నవ వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Update: 2024-04-02 12:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లై 30 రోజులు గడవక ముందే నవ వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రి బిల్డింగ్ పై నుంచి దూకి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ ఎన్టీఆర్ నగర్‌లో జరిగింది. పోలీసులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ‘‘రితీష్ రెడ్డి అనే యువకుడు ఎన్టీఆర్ నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ బిల్డింగ్ ముందు కారు పార్కింగ్ చేసి, అదే భవనం పైకి ఎక్కి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

అయితే రితీష్ ఓ యాక్సిడెంట్ చేయడంతో ఆ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించినట్లు సమాచారం. దీంతో భయపడిన రితీష్ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు. మరోవైపు రితీష్ రెడ్డి మరణానికి గల బలమైన కారణమేంటని పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, రితీష్ రెడ్డికి నెల రోజుల క్రితమే పెళ్లయ్యింది. ఇంతలోనే ఈ విషాదం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.


Similar News