కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఇంట్లో పనిచేసే పనిమనిషి దారుణ హత్య
గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఇంట్లో పనిచేసే పనిమనిషి శనివారం దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తుంది.
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఇంట్లో పనిచేసే పనిమనిషి శనివారం దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తుంది. అనుమానంతో తన భర్తే హత్య చేసి ఎవరికి తెలియకుండా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అనుమానం వచ్చి అతడిని ఆపి నిలదీయడంతో మృతదేహం చెత్త డబ్బాలో దొరికింది అని చెప్పుకొచ్చాడు. దీంతో అక్కడి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడు మహమ్మద్ హసన్ ఎంక్వైరీ చేయగా.. అనుమానంతో తన భార్య ఆస్మా బేగంను కత్తితో పొడిచి చంపినట్లు ఒప్పుకున్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆస్మా బేగం గత కొంతకాలంగా కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఇంట్లో పనిమనిషిగా చేస్తుందని కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. కాగా ఆస్మా హత్య విషయం తెలుసుకున్న ఫిరోజ్ ఖాన్ హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.