వ్యవసాయ పొలంలో కుళ్లిపోయిన మృతదేహం లభ్యం

వ్యవసాయ పొలంలో కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది.

Update: 2024-08-29 16:12 GMT

దిశ, బషీరాబాద్ : వ్యవసాయ పొలంలో కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన బషీరాబాద్ మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామ శివారులో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా ఎతొండ గ్రామానికి చెందిన రెడ్డి రవి (41 ) అనే వ్యక్తి ఈనెల 22వ తేదీన తన భార్యతో కలిసి తిరుపతి వెళ్లి తిరిగి వాళ్ళ గ్రామానికి రైలులో వెళ్తుంటే మార్గమధ్యలో బషీరాబాద్ (నవాండ్గి) రైల్వే స్టేషన్ దగ్గరకు రాగానే మృతుడు మతిస్థిమితం లేకుండా పిచ్చిగా ప్రవర్తించి రైలు దిగి పోయాడు. అంతలో రైలు వెళ్ళిపోయింది. ఈ విషయంపై వికారాబాద్ రైల్వే పోలీస్ వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

మృతుని గురించి రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు వెతికిన ఆచూకీ లభించలేదు. అల్లాపూర్ (బి) గ్రామ శివారులో ఉన్న రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయ పొలానికి రాథోడ్ సురేష్ కౌలుకి చేస్తున్నాడు. పొలం పనుల కోసం వెళ్లాడు. కుళ్లిపోయిన గుర్తుతెలియని వ్యక్తి శవం కనిపించింది. ఈ విషయాన్ని బషీరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం మేరకు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇట్టి సమాచారాన్ని మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుని గుర్తించారు. మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఆహారం తినక పోవడం తో చనిపోయాడు అని, మృతుని మరణం ఎలాంటి అనుమానం లేదని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బషీరాబాద్ పోలీసులు తెలిపారు.


Similar News