నడిరోడ్డుపై నోట్లు విసిరేస్తూ హల్‌చల్​​ చేసిన యువకుడిపై కేసు నమోదు

నడిరోడ్డుపై నోట్లు విసిరేస్తూ కూకట్​పల్లి లో హంగామా సృష్టించిన యువకుడిపై

Update: 2024-08-23 16:24 GMT

దిశ, కూకట్​పల్లి: నడిరోడ్డుపై నోట్లు విసిరేస్తూ కూకట్​పల్లి లో హంగామా సృష్టించిన యువకుడిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కూకట్​పల్లి, కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ల పరిధితో పాటు సనత్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని యువకుడు పవర్​ హర్ష ​ అలియాస్ వంశీ రీల్స్​లో లైకులు, ఫాలోవర్స్​ కోసం రోడ్లపై నోట్లను విసిరేస్తు హల్​ చల్​ సృష్టించాడు. కాగా వాటికి సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ అవడంతో నెటిజన్లు సదరు యువకుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తు కామెంట్స్​ చేశారు. దీంతో స్పందించిన తెలంగాణ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలోని కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్లో ఎఫ్ఐఆర్​ నెంబర్ 1047/2024, ఐపీసీ 336, 341, 268 రెడ్​ విత్​ 34 సెక్షన్​ కింద కేసు నమోదు చేశారు.

కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​లో ఎప్​ఐఆర్​ నంబర్​ 937/2024 ఐపీసీ 336, 341, 290 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదే విధంగా సనత్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఎఫ్​ఐ ఆర్​ నెంబర్​ 621/2024, 292, 126(2), 125 బీఎన్​ఎస్​ సెక్షన్​ల కింద కేసు నమోదు చేశారు. అదే విధంగా యువకుడిపై కేసు నమోదు చేసిన ఎఫ్​ఐ ఆర్​ కాపీలను తెలంగాణ పోలీస్​ అఫిషియల్​ ఎక్స్​ ఖాతాలో అప్​లోడ్​ చేశారు. దానికి తోడు యువతకు సూచనలిస్తూ... తమ కెరీర్​, లక్ష్యాలపై దృష్టి సారించాల్సిన యువత దారి తప్పుతుంది. సమాజానికి ప్రమాదకరంగా మారి, వారి కుటుంబాలను కూడా ప్రమాదంలోకి నెడుతుంది. ఇలాంటి దుశ్చర్యలకు పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోరు. కఠిన చట్టాలు ప్రయోగించి జైలు ఊచల వెనుక బందీ చేస్తారు తస్మాత్​ జాగ్రత్త అంటు హెచ్చరిస్తూ యువకుడి నోట్లు విసురుతున్న ఫోటోలను ప్రదర్శిస్తూ పోస్ట్​ను అప్​లోడ్​ చేశారు. ఇదిలా ఉండగా కూకట్​పల్లి పోలీసులు సదరు యువకుడిని అరెస్ట్​ చేశారు. కాగా యువకుడి పేరు పవర్​ హర్ష కాదు వంశీ గా కూకట్​పల్లి పోలీసులు తెలిపారు.


Similar News