బెల్లంపల్లి కల్వరి చర్చి పాస్టర్ ప్రవీణ్ షారోన్‌పై కేసు నమోదు..

మంచిర్యాల జిల్లా సోమగూడెం కల్వరి చర్చి పాస్టర్ ప్రవీణ్, షారోన్ పై కేసు

Update: 2024-07-12 16:32 GMT

దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా సోమగూడెం కల్వరి చర్చి పాస్టర్ ప్రవీణ్, షారోన్ పై కేసు నమోదు చేసినట్లు కాసిపేట ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. పాస్టర్ ప్రవీణ్ షారోన్ హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో కిడ్నీ సమస్యతో ఏడేళ్ల బాలిక చికిత్స పొందుతుంది. సదరు బాలికను పాస్టర్ ప్రవీణ్, షారోన్ తీసుకెళ్లి హైదరాబాద్ లోని కల్వరి చర్చి మిరాకిల్ హీలింగ్ షో లో బలవంతంగా నడిపించారు. అంతేకాకుండా ఈ వీడియో ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడం వివాదానికి దారి తీసింది. ఈ ఘటనపై లీగల్ కం ప్రొబేషన్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.


Similar News