అదుపు తప్పి చెట్టును ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి

కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో జరిగింది.

Update: 2024-05-14 05:51 GMT

దిశ, మేడిపల్లి : కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో జరిగింది. స్థానిక సురభి రైస్ మిల్ దగ్గర మంగళవారం తెల్లవారు జామున కారు చెట్టుకు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏన్నమనేని సృజన్ కుమార్ అనే వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వాహనాన్ని అక్కడి నుంచి తొలగించి సృజన్‌ను చికిత్స నిమిత్తం జగిత్యాల హాస్పిటల్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ సృజన్ మృతి చెందాడు. కారు స్పీడ్ గా నడపడం, నిద్ర మత్తు ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. కోరుట్ల నుండి మేడిపల్లికి వచ్చే మార్గమధ్యంలో ఈ సంఘటన జరిగినట్లు తెలిసింది.


Similar News