బైకును ఢీకొట్టిన కారు..ఒకరు మృతి.. ఆలస్యంగా వెలుగులోకి

ఉప్పల్ లో శనివారం తెల్లవారుజామున కారు,బైకును ఢీ కొట్టడంతో ఇద్దరి

Update: 2024-08-22 11:46 GMT

దిశ,ఉప్పల్: ఉప్పల్ లో శనివారం తెల్లవారుజామున కారు,బైకును ఢీ కొట్టడంతో ఇద్దరి యువకులకు తీవ్రగాయలైన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గద్వాల్ జిల్లాకు చెందిన గుజ్జల రాజు(24) బీటెక్ పూర్తి చేశాడు ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు.విశ్వతేజ (18) బీదర్ జిల్లా యున్నాబాదులో ఇంటర్ చదువుతున్నాడు.వీరిద్దరూ అన్నదమ్ములు హబ్సిగూడ నుండి ఉప్పల్ కు బైక్(టీఎస్ 33 హెచ్ 2231) మీద ఉప్పల్ స్టేడియం సమీపంలో ఏక్ మినార్ వద్ద యూటర్న్ తీసుకుంటుండగా (టీఎస్ 08 కెఎఫ్ 0111) వోక్స్ వేగన్ కారు ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వైపు అతి వేగంగా వచ్చి బైక్ ను ఢీ కొట్టడంతో ఇద్దరు కిందపడ్డారు. కారు,బైకు నుజ్జునుజ్జు అయింది.చికిత్స నిమిత్తం క్షతగాత్రులను యశోద ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతున్న విశ్వతేజ(18)బుధవారం రాత్రి మరణించాడు.న్యాయం కోసం బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కారు ఓవర్ స్పీడ్ నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని,ఈ కారుపై ఓవర్ స్పీడ్ చలానాలు ఉన్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు.

సీఐ ఎలక్షన్ రెడ్డి వివరణ..

చిల్కానగర్ డివిజన్ రాఘవేంద్ర కాలనీకి చెందిన నలుగురు వ్యక్తులు కారులో ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా కారు,బైక్ ని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.కారు నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.


Similar News