రాహుల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న రతిక తల్లిదండ్రులు..కానీ?
నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్ సీజన్-7 లో హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది రతిక రోజ్.
దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్ సీజన్-7 లో హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది రతిక రోజ్. ఈ అమ్మడు క్యూట్ లుక్స్‌తో జనాలందరినీ ఆకట్టుకుంది కానీ.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, యావర్‌తో కాస్త చనువుగా ఉండటంతో ఆడియన్స్ వద్ద నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఎప్పుడైతే నామినేషన్స్ మొదలయ్యాయో అప్పుడు ఆమె అసలు నిజ స్వరూపం బయటపెట్టింది. ప్రశాంత్‌ను చిన్న చిన్న విషయాలకే తిట్టడం, కాస్త ఓవర్ యాక్షన్ చేయడంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇటీవలే అనూహ్యంగా మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది.
అయితే, రతిక హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో బిగ్ బాస్ ఎవరినైనా మిస్ అవుతున్నావా? అని అడగ్గా.. గత నాలుగేళ్ల నుంచి మిస్ అవుతున్నానే అని చెప్పుకొస్తుంది. దీంతో రాహూల్ సిప్లీగంజ్ ప్రేమాయణం బయటికొచ్చింది. ఎప్పుడైతే హౌజ్‌లో తన మాజీ ప్రియుడి గురించి కామెంట్స్ చేసిందో వెంటనే రాహుల్- రతికల ప్రైవేట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రీసెంట్‌గా ఆ ఫొటోలపై రతిక సిస్టర్ స్పందించిన విషయం తెలిసిందే.
తాజాగా రాహుల్- రతికల ప్రేమ వ్యవహారంపై రతిక పేరెంట్స్ రాములు, అనిత స్పందించి.. ‘‘రతిక పటాస్ షో చేస్తున్న సమయంలోనే యూట్యూబ్ కోసం రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి కొన్ని పాటల్లో నటించింది. ఆ తర్వాత వారిద్దరి గురించి చాలామంది తప్పుగా మాట్లాడుకున్నారు. మాకు చాలా బాధగా అనిపించింది. రాహుల్ నా రెండో కూతురు పెళ్లికి వచ్చారు. అప్పుడు రతికను పెళ్లి చేసుకుంటానంటేనే తనతో మాట్లాడాలని ఇంటికి పిలిచి మరీ చెప్పాను. తర్వాత రాహూల్ మళ్లీ టచ్‌లో కూడా లేకుండా పోయాడు.’’ అంటూ రతిక తల్లిదండ్రులు వెల్లడించారు.