ప్రశాంత్‌కి ఎక్కడో మచ్చ ఉంది.. బిగ్ బాస్ విన్నర్ అతడే కావాలి: రతిక కామెంట్స్ వైరల్
బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ రతిక రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ రతిక రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్టింగ్ స్టార్టింగ్‌తోనే ప్రశాంత్‌తో మంచిగా ఉన్న రతిక.. సడెన్‌గా ప్లేట్ మార్చి ఆడియన్స్‌లో నెగిటివ్ అయింది. దీంతో నాలుగో వారం లోనే ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. తర్వాత అదృష్టం కలిసి వచ్చి వైల్డ్ కార్డుతో మరోసారి హౌప్లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండోసారి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ గేమ్ సరిగ్గా అడలేదు. దీంతో మరోసారి ఇంటి నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా రతిక రోజ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరో చెప్పుకొచ్చింది.
రతిక మాట్లాడుతూ.. ‘ఉల్టా పుల్టా సీజన్ అన్నారు కానీ.. నాకు నిజంగానే ఉల్టా పుల్టా అయ్యింది. ఒకసారి వెళ్లి ఎలిమినేట్ అయ్యి.. మళ్లీ రెండోసారి వెళ్లాను. అయితే ఫస్ట్ టైం వెళ్లినప్పుడు మైనస్ అయ్యింది... రెండోసారి వెళ్లినప్పుడు ప్లస్ అయ్యింది. నాకు చాలా ఫేమ్ వచ్చింది. ఇక ప్రశాంత్ గురించి చెప్పాలంటే.. అతనికి చెప్పే విధానం సరిగా లేకపోవడం వల్ల నేను బ్యాడ్ అయ్యాను. నువ్వు నాపైనే కాకుండా గేమ్‌పై కూడా ఫోకస్ పెట్టి ఆడు అని స్వీట్‌గా చెప్పి ఉంటే బాగుండేది. ఈ కిస్‌లు.. సోఫాపై పేర్లు రాయడం కాదు ప్రశాంత్.. ఇంత కష్టపడి వచ్చావ్ కదా ఇవన్నీ పక్కన పెట్టి గేమ్‌పై ఫోకస్ పెట్టు. అలా చెప్పి ఉంటే బాగుండేది. కానీ నేను వేరేలా చెప్పడం వల్ల జనాల్లో నేను అయ్యాను. కానీ ప్రశాంత్‌కి ఎక్కడో మచ్చ ఉంది. అదృష్టం ఉంది. నేను బయటకు వచ్చేసిన తర్వాత ప్రశాంత్ ఆట ఇంప్రూవ్ అయ్యింది. బాగా ఆడుతున్నాడు. ఇక యావర్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్న. ఎందుకంటే తను ఆట చాలా బాగా ఆడుతున్నాడు. నా ఫ్రెండ్ విన్నర్ అవ్వాలని ఉంది. అంటే మిగిలిన వాళ్లు కాకుడదని కాదు’ అని చెప్పుకొచ్చింది.