నా బాయ్ ఫ్రెండ్ నన్ను వదిలేస్తాడేమో భయంగా ఉంది.. లైవ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న బిగ్‌బాస్ బ్యూటీ
బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. ముగిసిన ఏడు వారాల్లో వరుస పెట్టి అమ్మాయిలు ఎలిమినేట్ కాగా.. గత వారం సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక నామినేషన్స్, గేమ్స్, గొడవలు ఇవన్నీ పక్కన పెడితే.. బిగ్ బాస్ హౌస్‌లో జంటలకు మాత్రం కొదవ లేదు. ఒక్కొక్కరు ఒక్కరితో జంట అయిపోయి ఉంటున్నారు. ఇందులో శోభశెట్టి, టేస్టీ తేజ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత రాత్రి జరిగిన ప్రక్రియ భాగంగా ఆడవాళ్లకు సెలవు ప్రకటించి ఇంట్లో మగవాళ్ళతోనే పనులు చేయించాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే శోభా శెట్టి తేజతో పళ్లు తోమించుకోవడం, ఎక్కడికి వెళ్లిన ఎత్తుకోమనడం లాంటివి చేసింది.
భార్యకు ఏదైనా సమస్య వస్తే భర్త ఎలా పట్టించుకుంటాడో అలాగే చెయ్యి అని తేజతో శోభా అనడంతో.. తేజ ఏకంగా బిగ్ బాస్ మేము ఇద్దరం భార్యాభర్తలం.. మీరు మా పెళ్లికి కూడా రావాలి అంటూ చెప్తాడు. ఇలా లవ్ యాంగిల్స్ పక్కన పెడితే శోభ ఇంట్లో కూడా ఓ రేంజ్లో అరుస్తుంటుంది. నామినేషన్స్ అప్పుడు అయితే ఏకంగా సైకోలా బిహేవ్ చేస్తుంది. ఈ క్రమంలోనే పాపకు భయం మొదలైంది. లాస్ట్ వీక్ దాదాపు ఎలిమినేట్ అయ్యే పరిస్థితికి వచ్చిన శోభా.. ఈ వారం కూడా నామినేషన్స్‌లో ఉండటంతో ఇంటి నుంచి వెళిపోతానేమో అనే భయంతో పాటు తన బిహేవియర్ చూసి తన బాయ్ ఫ్రెండ్ మిస్ అండర్‌స్టాండ్ తీసుకుని వదిలేస్తాడేమో అని ఎమోషనల్ అయింది.
తన (బాయ్ ఫ్రెండ్) గురించి మాట్లాడుతూ.. బయట నేను ఎలా ఉన్నానో బిగ్ బాస్ ఇంట్లో కూడా అలాగే ఉన్నాను. కానీ చూసే వాళ్లకు వేరే విధంగా కనిపించవచ్చు కదా. అరవడం గురించి అయితే అతనికి తెలుసు.. కానీ అది కాకుండా ఇంకేదైనా ఉందేమో చెప్పలేం కదా. వాడు చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తాడు. కానీ ఒక్కొక్కరికి ఒక్కో మెంటాలిటీ ఉంటుంది. దేన్ని ఎలా తీసుకుంటారో తెలియదు కదా. తేజా నీ విషయమే తీసుకుందాం. నీతో కలిసి ఉండటం అతనికి నచ్చకపోవచ్చు. ఇవన్నీ తప్పుగా అర్థం చేసుకుని నన్ను వదిలేస్తే నేను తట్టుకోలేను’ అంటూ ఎమోషనల్ అయింది. దానికి తేజ నేనో కామెడీ పీస్ గాడ్ని.. మీ మైండ్‌లో అది తీసెయ్’ అంటూ తేజ రిప్లై ఇచ్చాడు.