కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన గౌతమ్.. హౌస్‌లో మొదటిసారి అలాంటి నిర్ణయం!

బిగ్‌బాస్ షో ఈ సారి ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో వచ్చి అందరికీ ఆసక్తిని పెంచింది. ఈ షో ఇప్పటికే స్టార్ట్ అయి ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది.

Update: 2023-10-31 07:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ షో ఈ సారి ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో వచ్చి అందరికీ ఆసక్తిని పెంచింది. ఈ షో ఇప్పటికే స్టార్ట్ అయి ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది. తాజాగా, ఇందులో కంటెస్టెంట్ అయిన డాక్టర్ గౌతమ్ కృష్ణ బిగ్‌బాస్ చరిత్రలోనే ఏ కంటెస్టెంట్ చేయని విధంగా ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నాడట. అసలు విషయంలోకి వెళితే.. సాధారణంగా ప్రతి వారం కెప్టెన్సీ టాస్క్ ఉంటుంది. ఎనిమిదో వారం ఐదుగురు కంటెస్టెంట్స్ కెప్టెన్సీ కోసం పోటీపడగా అందులో గౌతమ్ విజయం సాధించాడు. బిగ్‌బాస్ ఇంటి కెప్టెన్‌గా గౌతమ్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ‘‘ ప్రతి ఇంట్లో ఆడవాళ్లు ఎన్నో రకాల పనులు చేస్తుంటారు. ఇంటి బాధ్యతలు చూసుకోవడంలో వాళ్లదే అప్పర్ హ్యాండ్.

ప్రతి ఇంట్లో ఉన్నా, ఇక్కడ ఉన్నా టీవిల్లో చూస్తున్న ఆడవాళ్లకు గౌరవంగా మన బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం ఫిమేల్ వీక్ జరుపుకుందాం. ఇందుకోసం ఈ వారం అంతా లేడిస్‌కు హాలిడేస్ ఇస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు. అలాగే ఎక్కువ పని చేసిన వారికి కష్టజీవి అని.. తక్కువ వర్క్ చేసిన వారికి దొంగ అనే బిరుదులు కూడా ఉంటాయని తెలిపాడు. కష్టపడిన వారికి ఒక డ్రింక్ ఇస్తాను. పని దొంగ తన రెండు గుడ్లను కూడా త్యాగం చేయాలని చెప్పాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు గౌతమ్ చేసిన పనికి ఫిదా అవుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. బిగ్‌బాస్ చరిత్రలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మొదటిసారి కావడంతో గౌతమ్ చరిత్ర సృష్టించాడు.


Similar News