బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసిన వైద్యులు.. టెన్షన్లో అతడు!
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ అన్ని బాషల్లో సక్సెక్ఫుల్గా కొనసాగుతుంది. అలాగే హీందీలోనూ 17వ సీజన్ ప్రసారమవుతుంది.
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ అన్ని బాషల్లో సక్సెక్ఫుల్గా కొనసాగుతుంది. అలాగే హీందీలోనూ 17వ సీజన్ ప్రసారమవుతుంది. దీనికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ జంట అంకితా లోఖండే- విక్కీ జైన్ దంపతులు పాల్గొన్నారు. ఇక టాస్క్ లో భాగంగా ఇద్దరూ ఎన్నోసార్లు కొట్టుకున్నారు. అలాగే అంకిత అందరి ముందే భర్తను కాలితో కూడా తన్నిన సంగతి తెలిసిందే.
తాజాగా, అంకిత ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని భర్తకు చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘ నాకు ఒంట్లో బాగాలేనట్లు అనిపిస్తుంది. నాకు ఈ నెల పీరియడ్స్ కూడా రాలేదు. ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది అని చెప్తుంది. అప్పుడు విక్కీ అదేంటి నీకు పీరియడ్స్ వచ్చాయనుకున్నా అంటాడు. దానికి అంకిత లేదు.. నన్ను మెడికల్ రూమ్‌కు పిలిచి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు. అలాగే రక్తపరీక్షలు, మూత్ర పరీక్షలు కూడా చేశారు కానీ రిజల్ట్ గురించి ఏం చెప్పలేదు. అందుకే టెన్షన్ అవుతోంది. నేను ఎలా ఫీలవుతున్నాననేది మాటల్లో చెప్పలేను. ఏమీ అర్థం కాకుండా ఉంది’’ అని చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతోంది.