పల్లవి ప్రశాంత్‌ను ఓడించేందుకు కుట్ర.. ఓట్లు పడకుండా ఏం చేస్తున్నారో తెలుసా?
రైతు బిడ్డగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్.
దిశ, వెబ్‌డెస్క్: రైతు బిడ్డగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. మొదట్లో ప్రేక్షకులంతా ఈ కంటెస్టెంట్ 4 వారాలు ఉంటే గొప్ప అనుకున్నారు. అలాంటిది తన ఆట తీరుతో టైటిల్ ఫెవరేట్ అయ్యాడు. ప్రస్తుతం ప్రశాంత్‌కు భారీ ఫాలోయింగ్ పెరిగింది. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌ల్లో చిరుతలా పోరాడుతాడు. ప్రశాంత్‌లో నచ్చే మరో మంచి లక్షణం ఏంటంటే? ఎవరిపైనా ద్వేషం పెంచుకోడు. ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు. అయితే బిగ్ బాస్ సీజన్-7 ఫినాలేకు 9 రోజుల సమయం మాత్రమే ఉంది. హౌస్ లో ఉన్న ఏడుగురి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ప్రస్తుతం టైటిల్ కోసం ఓటింగ్ జరుగుతుంది. కాగా అమర్, ప్రశాంత్, శివాజీ మధ్య టైటిల్ పోరు ఉంటుందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే పల్లవి ప్రశాంత్‌ను ఓడించేందుకు కుట్ర జరుగుతుందని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. మిస్డ్ కాల్ ఓటింగ్‌లో ప్రశాంత్‌కు ఓట్లు పడకుండా చేస్తున్నారట. ప్రశాంత్‌కు కేటాయించిన 8886676905 నెంబర్ సరిగా పనిచేయడం లేదట. మిస్డ్ కాల్ రిజిస్టర్ అవడం లేదట. అమర్ దీప్ నెంబర్ 8886676901 మాత్రం ఏ సమయంలోనైనా పనిచేస్తుందట. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.