Bigg Boss-7: వచ్చిన నెగిటివిటీని పోగొట్టుకునేందుకు పెద్ద ప్లానే వేసిన బిగ్ బాస్..!
బుల్లితెరపై ప్రచారం అవుతున్న రియాలిటీ షోలలో అత్యంత ఆదరణ పొందిన షో ‘బిగ్ బాస్’.
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై ప్రచారం అవుతున్న రియాలిటీ షోలలో అత్యంత ఆదరణ పొందిన షో ‘బిగ్ బాస్’. సక్సెస్ ఫుల్‌గా 6 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ప్రస్తుతం 7వ సీజన్ కూడా ఎంతో రసవత్తరంగా దూసుకుపోతుంది. గత రెండు, మూడు సీజన్లతో బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ పడిపోవడంతో ఈ సీజన్ ఉల్టా పుల్టా గేమ్ షోగా తీసుకొచ్చారు బిగ్ బాస్ నిర్వహాకులు. అయితే.. గత సీజన్లతో పోల్చుకుంటే 7వ సీజన్‌కు మంచి రేటింగే దక్కుతుంది. దాంతో పాటు నెగిటివిటీ కూడా దారుణంగా పెరిగిపోతుంది.
బిగ్ బాస్ సీరియల్ బ్యాచ్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నాడని నెట్టింట టాక్. అంతే కాకుండా ఎవరు ఎన్ని తప్పులు చేసిన నిలదీసే హోస్ట్ నాగార్జున కూడా సీరియల్ బ్యాచ్‌కు సపోర్ట్‌గా ఉంటున్నాడని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. దీంతో పాటు శోభ శెట్టి ఎలిమినేట్ కావాలని మొన్నటి వరకు సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున రచ్చ నడిచిన విషయం తెలిసిందే. ఇక 11వ వారం ఆమె డేంజర్ జోన్లో ఉంది.. ఈ వారం ఎలా అయిన శోభ ఎలిమినేట్ అయిపోతుందని అందరూ గట్టిగా అనుకున్నారు. కానీ, ఫైనల్‌గా ఆ వీక్ అసలు ఎలిమినేషనే లేకుండా ఎత్తేశాడు బిగ్ బాస్. దీంతో మరింత నెగిటివిటీ పెరిగిపోయింది.
ఆ నెగిటివిటీని పోగొట్టుకునేందుకు ఈసారి బిగ్ బాస్ పెద్ద ప్లానే వేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ వారం ప్రియాంక సీక్రెట్ టాస్క్‌లో శోభకు హింట్ ఇవ్వడం.. యావర్‌ను బలిచేయడం వంటి విషయాల గురించి ప్రియాంకకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. గతంలో సింపథీ కోసం నువ్వు ఏడుస్తున్నావని ప్రశాంత్‌ని అమర్ అన్న మాటలు గుర్తు చేస్తూ.. అమర్‌ను కూడా ఓ ఆట ఆడేశాడు నాగ్. అయితే.. ఇదంతా చూస్తుంటే బిగ్ బాస్ ఎవరికీ సపోర్ట్ కాదు. అందరి తరఫున మాట్లాడతాడు అని నిరూపించుకునేందుకు.. అంతే కాకుండా నెగిటివిటీ పోగొట్టుకోవడానికే ఈ ప్లాన్ వేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.